మరో స్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరాం(77) కన్నుమూశారు. ఇటీవలే కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూయగా, శనివారం మధ్యాహ్నం వాణి జయరాం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వాణి జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మరణం సర్వసాధారణంగా జరగలేదని.. ఆమె ముఖంపై కనిపించే గాయాలు కలకలం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే.. రోజూలానే ఆమె ఇంట్లో పని మనిషిగా చేస్తున్న మహిళ శనివారం కూడా వాణీ జయరాం ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. ఇంట్లోకి వెళ్లేందుకు కాలింగ్ బెల్ నొక్కగా.. తలుపు తీయగా.. కంగారుపడిన పనిమనిషి వాణీ జయరాం బంధువులకు సమాచారం అందించింది. ఆ బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తలుపు బద్ధలు కొట్టి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో ఆమె విగత జీవిగా పడి ఉంది. దాంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాణీ జయరాం భర్త జయరాం 2018లో చనిపోవడం, వారికి పిల్లలు కూడా లేకపోవడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు.