తూప్రాన్. ముద్రణ న్యూస్: పరిశ్రమల ఏర్పాటుకోసం రైతులనుండి ప్రభుత్వం సేకరించిన భూముల నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని యువకుడిపై మట్టి మాపియా దాడి చేసిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామ శివారులో జరిగింది.
ఎస్ఐ సందీప్ రెడ్డి కథనం ప్రకారం రంగాయిపల్లి గ్రామ శివారు భూమికి సమీపంలో కొందరు అక్రమార్కులు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. కాగా గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు మట్టి రవాణాకు అడ్డు చెప్పగా… మట్టి రవాణాదారులు శ్రీనివాస్ పై దాడి చేసి గాయపరిచారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను సిజ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాయికుమార్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సందీప్ రెడ్డి తెలిపారు.