- చెల్లచెదురుగా పడిఉన్న శరీర భాగాలు…
- సీఐ ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తు, డాగ్ స్క్వాడ్ తో గాలింపు…
ముద్రణ, మల్యాల: మల్యాల క్రాస్ రోడ్డు సమీపంలో మంగళవారం పోలీసులు కాలిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. సంఘటన స్థలంలో పూర్తిగా కాలిపోయిన శరీర భాగాలు చెల్లచెదురుగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… క్రాస్ రోడ్డు సమీపంలోని టేక్ ప్లాంటేషన్ ముందు.. కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారికి కొద్ది దూరంలో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఘటన స్థలం సమీపంలో లభించిన ఆధారాలను బట్టి వ్యక్తిని హత్య చేసి, సజీవదహనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, దాదాపు మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలో, వ్యక్తిని పాత టీవీలు, ప్లాస్టిక్ వస్తువులలో పడేసి కాల్చడం వల్ల దుర్వాసన వ్యాపించడంతో పాటు, ఎముకలు మాత్రమే ఉన్నాయి.. పోలీసులు ఘటన స్థలంలోనే ఫోరెనిక్స్ నిపుణులతో పోస్టుమార్టం నిర్వహించి, డిఎన్ఏ పరీక్షల కోసం కొన్ని శరీర భాగాలను ల్యాబ్‌కి తీసుకువెళ్లారు. మిగిలిన భాగాలను అక్కడే పూడ్చి పెట్టారు. మల్యాల సీఐ రమణ మూర్తి, కొడిమ్యాల్ ఐఐ వెంకట్ రావు సంఘటనా ఎస్సై సందర్శించి, దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.