- గొంతు కోసి హత్య
- ఆస్ట్రేలియా ఇటీవలే వచ్చిన హతుడు
- రంగంలోకి పోలీస్ బృందాలు
ముద్ర ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ విద్యానగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని పీటీసీ రోడ్డులో పురంశెట్టి నరేందర్ అనే యువకుడు దారుణ హత్యకు పాల్పడ్డాడు. గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సంతోష్ నగర్ లో మూతపడ్డ ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఈ దారుణం జరిగింది. నరేందర్ తో పాటు మరికొందరు కలసి మద్యం సేవించినట్లు ఆనవాళ్లు ఉన్నారు. మద్యం సేవించిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
కుటుంబ కలహాలు ఈ సంఘటనకు కారణం అయి ఉండవచ్చన్నది మరో కోణం. నరేందర్ సంతోష్ నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు. కొద్దీ రోజులు ఆస్ట్రేలియాలో ఉండి ఇటీవలే కరీంనగర్ వచ్చినట్లు. సంఘటనను సందర్శించి టౌన్ ఏసీపీ తుల శ్రీనివాస్ రావు, టూటౌన్ సీఐ లక్ష్మిబాబు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీముతో మర్డర్ కు గల ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఉగాది పండుగ వేళ హత్య జరగడంతో కరీంనగర్ ఉలిక్కిపడింది.