ముద్ర , కుషాయిగూడ: అనారోగ్య సమస్యలు… పిల్లల బుద్ధిమాంద్యాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు… పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం… గాదె సతీష్ (39), అతని భార్య గాదె వేద(35), కుమారులు గాదె నిషికేత్ (9), గాదె నిహాల్ (5) లతో కలసి కందుకూడా క్రాంతి పార్క్ రాయల్‌లో బి 107 ఫ్లాట్‌లో ఉన్నారు.
గాదె సతీష్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కాగా అతని భార్య గృహిణి. ఇక పెద్ద కొడుకు స్థానికంగా ఉన్న భవిన్స్ లో నాలుగో తరగతి చదువుతుండగా, చిన్న కొడుకు… ఆర్టిజన్ స్కూల్లో చదువుతున్నాడు. ఈ విధంగా బుద్ధిమంతులైన కుమారుల ఆరోగ్య సమస్యలను.. తట్టుకోలేని భార్యాభర్తలు పిల్లలతో సహా శనివారం మధ్యాహ్నం తమ ప్లాట్‌ఫారమ్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పూర్తి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.