తూప్రాన్, ముద్ర:తూప్రాన్‌లో గల మహాత్మా జ్యోతి బా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి అస్వస్థత గురై ఆసుపత్రిలో చేరి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పెద్ద శంకరం పేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సౌజన్య (13) 8వ తరగతి చదువుతుంది. ఈ నెల 22న జ్వరం రాగా హస్టల్ వార్డెన్ టాబ్లెట్ ఇచ్చారు. ఇయినా జ్వరం తగ్గింది విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందింది.
కుటుంబ సభ్యులు హైదరాబాద్ అస్పత్రికి. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి అస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఈ విషయంపై విద్యార్ధిని బంధువులు పాఠశాల ప్రిన్సిపాల్ అర్షియా తరణ్మన్, వార్డెన్ నిర్లక్ష్యం వల్లే తమ అమ్మాయి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పాఠశాల పిన్సిపల్ అర్షియాను అడగగా విద్యార్థిని జ్వరం విషయంలో తమ నిర్లక్ష్యం ఏమి లేదని సమయానికి స్పందించి మందులు అందించామని, అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు. విద్యార్థిని చెందడం బాధాకరం అని ఆమె మృతి చెందింది.