ముద్రణ ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కడెం మండలం అంబారి పేట్‌లో శనివారం రాత్రి వీధికుక్కలు గొర్రెల కొట్టంలో ప్రవేశించి దాడి చేసిన ఘటనలో 20 గొర్రెలు చనిపోయాయి. గ్రామానికి చెందిన కొమురయ్య ప్రతిరోజు లాగే శనివారం రాత్రి తన 25 గొర్రెలను పాకలో వదిలి వెళ్ళాడు. అర్థరాత్రి వీధి కుక్కలు పాకలోకి దూరి 20 గొర్రెలను చంపివేశాయి. ఈ ఘటనలో బాధితునికి దాదాపు రూ.2.50 లక్షల మేర నష్టం వాటిల్లింది.