మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో కన్న కూతురు రజిత (10)లు తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో జనాలపై తరచుగా దాడులు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
కూతురును చంపిన తర్వాత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి దూపం శ్రీనివాస్ పై దాడికి పాల్పడ్డాడు. నిందితులను తమకు అప్పగించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో భట్టుపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.