- 8.55 లక్షల నకిలీ కరెన్సీ పట్టివేత
- శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి
ముద్రణ ప్రతినిధి, రంగారెడ్డి: నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న అంతరాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను శంషాబాద్ జోన్ ఎస్ వో టీ పోలీసులకు తీసుకున్నారు. శనివారం ఈ కేసులకు సంబంధించిన వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు తెలిపారు. శంషశంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి కథనం ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనకాపల్లి నర్సీపట్నం కు చెందిన టి రంజిత్ సింగ్, మరో నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన ఎం మోహన్ రావుతో కలిసి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక హోటల్‌లో బస చేసి 500,200,100,50 రూపాయల నకిలీ నోట్లు ఎస్ వో టి పోలిసులు దాడులు చేశారు.
వారి వద్ద నుండి 8 లక్షల 55 వేల రూపాయల నకిలీ కరెన్సీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠా సభ్యులను ఇన్‌స్టాగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా సంప్రదించి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో అసలు కరెన్సీ 1.3% నకిలీ కరెన్సీ వ్యాపారిని పొందింది. కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారులు పండ్ల మార్కెట్ కిరాణా దుకాణాలు రైతుబజార్ వంటి రాత్రితో నకిలీ కరెన్సీని కలిపి చలమలు చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తే సులువుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రముఖ పాత్ర వహించిన శంషాబాద్ ఏసీపీ భాస్కర్ వేముల, సిఐ శ్రీధర్ కుమార్, ఎస్‌ఓటి ఇన్‌స్పెక్టర్ బి సత్యనారాయణ బృందాన్ని నారాయణరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.