గూడూరు మే 15 (ముద్ర): ఇంటర్మీడియట్‌లో ఫెయిలయ్య ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ గూడూరు మండల కేంద్రం పొనుగోడు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే మహబూబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన తేజావత్ సింధు, అనే విద్యార్థిని ఇంటర్‌లో ఫెయిల్ అయ్యానని నేపంతో మనస్థాపానికి గురై ఈనెల 9న (రాట్ కిల్) ఎలుకల మందును సేవించింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ కు తీసుకెళ్లి అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. కూతురు మరణాన్ని చూసి తేజావత్ పూలు రోధిస్తున్న తీరును చూసి చాలా కంటతడి పెట్టారు.