ముద్ర, జనగామ ప్రతినిధి: ఎస్‌ఎంఎస్ పంజగుట్టలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గోల్కొండ స్వామి (36) గురువారం జనగామ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నర్మెట్ట నుంచి జనగామకు ఆటోలో పోతుండగా ఈ ఘటన జరిగింది. కుడుపులకు ఆటోలో నుంచి కానిస్టేబుల్ స్వామి ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు. అయితే, మార్గ మధ్యంలోనే స్వామి ప్రాణాలు వదిలారు.