ముద్ర ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లపల్లి ఘటన లక్ష్మీపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన. ఎస్సై నరేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన చింతపండు (కీశే)రాజయ్య- సతవ్వ ల కుమారుడు చింతపండు శ్రీనివాస్ (26) ట్రాక్టర్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు.కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి గత కొన్ని రోజులుగా అతనితో మాట్లాడటం లేదని మనస్థాపానికి గురై గ్రామ శివాలయం దగ్గరలోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. మృతిని సత్తవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.