- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
- రంగారెడ్డి జిల్లాలో ఘటన
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వికారాబాద్ అనంతగిరి గుట్ట విహారయాత్రకి వెళ్లిన విద్యార్థులు ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే.. కారులో మితిమీరిన వేగంతో వెళ్తుండగా చేవెళ్ల ఆరూర్ గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ప్రదీప్ అనే యువకుడు, సోనీ అనే మరో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆర్య, క్రాంతి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే.. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు.