శంకరపట్నం ముద్రణ అక్టోబర్ 01: శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామ శివాలయంలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. మహిళ తండ్రి తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామానికి చెందిన గుండారపు ప్రమీల( 55)గా పేర్కొన్నారు.
తన తల్లి గారి గ్రామమైన అర్కండ్ల నుండి తన తండ్రి కొమురయ్య తో కలిసి మొలంగూర్ వచ్చారు. తన తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో తాయత్తు కట్టించుకోవడానికి మొలంగూర్ గ్రామం వచ్చారు. అక్కడ తాయత్తు కట్టేవారు లేకపోవడంతో వెనుదిరిగి అదే గ్రామంలో ఆటో ఎక్కారు. ఆటోలో ఉన్న ఓ వ్యక్తి తాయత్తు కట్టిస్తానని చెప్పి తాడికల్ గ్రామ శివాలయంలోకి తీసుకెళ్లి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు, హుజురాబాద్ సిఐ సంతోష్ కుమార్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.