జఫర్‌గడ్, ముద్రణ : జనగామ జిల్లా జఫర్‌గడ్ అనే తీగారంలో ముస్కు రాంనర్సమ్మ (65) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం మృతురాలు రాంనర్సమ్మ భర్త యాదగిరి మూడు సంవత్సరాల కింద మరణించాడు.
ఉన్న ఇద్దరూ ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడంతో రాంనర్సమ్మ ఒంటరిగానే ఉంటుంది. అప్పుడప్పుడు మృతురాలు కూతుర్లు పెండ్లి సునీత, కమలమ్మ ఇంటికి వచ్చి తల్లి మంచి చెడులు చూసుకునేవారు. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతు కోసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై మహేందర్ ఘటనను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.