ముద్రణ, కోరుట్ల:- కోరుట్లలోని బిలాల్ పుర కు చెందిన షేక్ హైదర్–సుల్తానా బేగం దంపతుల కూతురు అస్రిన్ బేగం(14) స్థానిక గవర్నమెంట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. గత ఐదు రోజులుగా బాలిక పాఠశాలకు వెళ్లడం లేదు. అమ్మాయీ తల్లి సుల్తానా బేగం స్కూల్ కు వెళ్లమని మందలించగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి షేక్ హైదర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.