ముద్రణ, కోరుట్ల: కోరుట్ల గ్రామ శివారు పశు వైద్య కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న రెండు కార్లు ప్రమాదానికి గురికాగా అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర గాయాల పాలయ్యారు. వ్యవసాయ మార్కెట్ వద్ద జరిగిన మరో ఘటనలో రెండు ద్విచక్ర వాహనములు ప్రమాదానికి గురి కాగా అందులో ఒకరు కోరుట్ల వ్యక్తిగా మరోకరు మెట్‌పల్లి వ్యక్తిగా పేర్కొన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం రెండు ఘటనల్లో గాయపడిన వారిని 108 లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తించారు.