ముద్రణ ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ – ఘాట్ కేసర్ రైల్వేస్టేషన్ మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గురువారం ఉదయం గుర్తించారు. మృతి చెందిన మహిళ వయసు 20 నుంచి 25 సంవత్సరాలు ఉండవచ్చునని. ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి చనిపోయి ఉంటుందని, గురువారం ఉదయం 6.45 గంటల సమయంలో జరిగివుండొచ్చునని రైల్వే పోలీసులు తెలిపారు.
మృతదేహంపై పింక్ కలర్ లెగ్గింగ్, బూడిద రంగు టాప్, రెండు చెవులకు కమ్మలు ఉన్నాయి. ఈ మహిళ మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే నల్లగొండ రైల్వే పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ 8712658595 మొబైల్ నంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.