ప్రేమ వ్యవహారమే కారణం
ముద్రా ప్రతినిధి, మెదక్: యువ మెకానిక్ మెకానిక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ పట్టణం గంగినేని టాకీస్ ఎదురుగా మెకానిక్ షెడ్‌లో ఆదివారం ఉదయం వెలుగు చూసింది. చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లికి చెందిన బళ్లాల మహేష్(24) చనిపోయాడు.
ఆటోమొబైల్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
శనివారం రాత్రి 12 నుంచి 1 దాకా ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటానని తెలపగా ఆ అమ్మాయి మృతుని మిత్రునికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అర్ధరాత్రి దాటాక వచ్చి చూడగా అప్పటికే ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందాడు. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారంగా ఉంది. విచారణలో అన్ని విషయాలు బయటికి రానున్నాయి. మెదక్ టౌన్ స్పెక్టర్ వెంకటేష్ సంఘటన సందర్శించి వివరాలు సేకరించారు.