లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించారు. ‘మోదీ గ్యారెంటీ: 2047 నాటికి వికసిత్ భారత్’ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీలు వెల్లడించాయి. అభివృద్ధి, సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపారు.
రక్షణ శాఖ నాథ్ సింగ్ రాజ్ మంత్రిని 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీతో ఇప్పటికే రెండుసార్లు కీలక సమావేశాలు నిర్వహించారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించింది. సంకల్పపత్రం కోసం బీజేపీ ప్రజల నుంచి అభిప్రాయాలు కోరింది. దాదాపు 15 లక్షల సూచనలు రాగా, ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలు నమో యాప్ ద్వారా పార్టీతో పంచుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించింది.
బీజేపీ, లోక్‌సభ ఎన్నికలు, నరేంద్ర మోదీ