హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఎంపీ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ సోమవారం ఉదయం ప్రముఖ సినీనటుడు చిరంజీవిని కలిశారు. సీఎం రమేష్ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయినా సరే.. తనకు సహకరించాల్సిందిగా వచ్చిన అభ్యర్థికి భుజం తట్టి ప్రోత్సహించారు. చిరంజీవి మద్దతు కోరి వచ్చిన ఆయనతో మాట్లాడుతూ, ఏపీ ప్రజలకు న్యాయం చేయండి… మీ వెంట నేనున్నానని భరోసా ఇచ్చారు.