ముద్ర,సెంట్రల్ డెస్క్:- నేడు తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. తమిళనాడులో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండటంతో పవన్ కల్యాణ్ ను అక్కడ ఉండాలని కోరడంతో ఈరోజు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు.
తమిళి సైకు మద్దతుగా…
పవన్ కల్యాణ్ కు చెన్నైలోనూ అభిమానులుండటం, తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం చేసే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయని భావిస్తోంది. నేడు చెన్నై సౌత్ లో తమిళిసైకు మద్దతుగా పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం చెన్నైలో సాయంత్రం పవన్ కల్యాణ్ బహిరంగసభలో పాల్గొంటారు.