ముద్ర,సెంట్రల్ డెస్క్:- బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి కాల్పుల కేసులో ప్రమేయం మరో అనుమానితుడ్ని పోలీసులు బుధవారం రాత్రి హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వ్యక్తి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి, పోలీసుల అదుపులో ఉన్న షూటర్లు విక్కీ గుప్తా, సాగర్ కుమార్‌లకు మధ్యవర్తిగా పని చేసినట్లు అధికారులు తెలిపారు.
లారెన్స్ బిష్ణోయ్ ంగ్గ్యా సూచనల మేరకు గత ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్ మెంట్ బయట మోటార్ సైకిల్ పై వచ్చిన విక్కీ గుప్తా, సాగర్ కుమార్ ఐదు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇద్దరు వ్యక్తుల్లో సాగర్ కుమార్ ఏప్రిల్ 13 బాంద్రా ప్రాంతం నుంచి తుపాకీకి సమాచారం అందుతుంది. అయితే నిందితుడికి ఆయుధాన్ని అందించింది ఎవరూ అనేది తెలియాల్సి ఉంది.
నిందితులు ఇద్దరూ బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరిని సోమవారం అర్థరాత్రి గుజరాత్‌లోని కచ్ ఆలయ ప్రాంగణంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్, అతని అనుచరుడు విక్కీ గుప్తా ఇద్దరికీ కూడా కాల్పులు జరపడానికి రూ. 4 లక్షల సుపారీ ఆఫర్‌లో పేర్కొన్న సమాచారం. ముందుగా వీరికి లక్ష రూపాయలను అందించినట్లు అధికారులు తెలిపారు.
అయితే నిందితులు ఇద్దరు కూడా సల్మాన్ ఖాన్ ని చంపడం వారి లక్ష్యం కాదు..కేవలం కాల్పులు జరిపి భయపెట్టాలని వారికి ఆదేశాలు వచ్చినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితులు పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లో ‘రెక్కీ’ జరిగింది. వారు అతనిని భయపెట్టాలని భావించారు. హత్య చేయాలని అనుకోలేదని అధికారులు వివరించారు.నిందితుల కుటుంబాల వామూలాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కోసం సుమారు 7 గురిని హర్యానా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించినట్లు అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతున్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు సిద్దమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సల్మాన్ ఖాన్ సమావేశమయ్యారు. ఆయన అండగా ఉంటామని సల్మాన్‌కు హామీ ఇచ్చారు.