ముద్ర,సెంట్రల్ డెస్క్:- నేడు తొలి దశ ఎన్నికలు దేశంలో జరుగుతున్నాయి. ఈరోజు 21 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాలుగా ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తుంది. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16.63 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రెండు రాష్ట్రాలకు…
తొలి విడతలో అరుణాచల్ ప్రదేశ్‌లోని 60 స్థానాలకు, సిక్కింలోని 32 స్థానాలకు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు జమ్మికుంట ప్రాంతాలు జరగనున్నాయి.