ముద్ర,సెంట్రల్ డెస్క్:- భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠిని కేంద్రం నియమించింది. ప్రస్తుతం వైస్ చీఫ్‌గా ఆయనను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.