ముద్ర,సెంట్రల్ డెస్క్:- లోక్‌సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓటేశారు.
కుటుంబ సమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన జ్యోతి.. అందరితోపాటు క్యూలైన్‌లో నిల్చుని ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, అది మన విధి అని విజ్ఞప్తి చేశారు. దేశ పౌరులుగా అది మన బాధ్యత అని చెప్పారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. తాను చదువుకున్న స్కూల్‌లోనే ఓటు వేశానన్నారు.
#చూడండి | మహారాష్ట్ర: ప్రపంచంలోనే అత్యంత చిన్న మహిళ జ్యోతి అమ్గే ఈరోజు నాగ్‌పూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. #లోక్‌సభ ఎన్నికలు 2024 pic.twitter.com/AIFDXnvuvk
– ANI (@ANI) ఏప్రిల్ 19, 2024