ముద్ర,సెంట్రల్ డెస్క్:-అమూల్ పాల ధరలు మరోసారా పెరిగాయి. లీటర్ పాలపై రూ.2 వరకు పెంచుతున్నట్లు గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF). దేశంలో సోమవారం (జూన్ 3) నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.
నిర్వాహణ, పాల ఉత్పత్తి వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు GCMMF ప్రదర్శన. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ శక్తి అనే మూడు ప్రధాన అమూల్ పాల రకాల ధరలు పెరగనున్నాయని చెప్పింది. అయితే, అముల్ తాజా చిన్న పౌచ్ ధరలో ఎటువంటి మార్పు లేదు. కాగా, అమూల్ చివరిసారిగా 2023 ఫిబ్రవరిలో ధరలను సవరించింది.