నదిలో పడిన బస్సు: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ఘోర ప్రమాదంలో సుమారు 12 మంది యాత్రికులు మృత్యువాత పడ్డారు. రుప్రయాగ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 12మంది చనిపోగా, అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ డాక్టర్ విశాఖ అశోక్ ధ్రువీకరించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు.