ముద్ర,తెలంగాణ:- లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు పోలీసులకు హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడుతోంది. బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే 6 వాహనాల్లో కోటి 6లక్షల 62వేల 730 రూపాయల నగదును సీజ్ చేశారు. సైబరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి ఎస్వోటీ పోలీసులు 6 ప్రదేశాల్లో ఈ నగదును పట్టుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సరైన డాక్యుమెంట్లు తరలిస్తున్న నగదును సీజ్ చేశామని పోలీసులు తెలిపారు.