- కేసీఆర్ ప్రచార నిషేధం మోడీ , రేవంత్ కుట్రలో భాగమే
- మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా
- నేత కార్మికులు అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో మాటలు వక్రీకరించారు
- కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్, మోడీకి వణుకుడు మొదలైంది
- ఆరు యాత్రలతోనే ఇద్దరి కాళ్ళ కింద భూమి కంపిస్తుంది
- ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు
- కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నం
- కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుంది
- మోడీ విద్వేషాలు ప్రచారం ఈసీకి కనిపించడంలేదా
- ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా
- కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్ర
- వీధి రౌడిగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితం చేస్తున్నారు
- రేవంత్ ఢిల్లీ ఎందుకు మూటల పై సమాచారం ఉంటే మోడీ కేసులు పెట్టడం లేదు
- రేవంత్ అవినీతి తెలిసినా మోడీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయి
- కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రజా సమస్యలను రానీయకుండా పక్కదారి పట్టించడం కోసమే డ్రామాలు
- నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు
- కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదని ప్రజల్లో చర్చ మొదలైంది
- ఎన్ని నిషేధాలు పెట్టినా 16 సీట్లు మావే
- కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మాట్ల శాతాన్ని పెంచుతుంది
- ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉంది
- అందుకే ఇతర రాష్ట్రానికి మార్చాలని కోరాం
- కోర్టు సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం
సూర్యాపేట ముద్ర ప్రతినిధి:-బారాసా అధ్యక్షులు కేసీఆర్ పై ప్రచార నిషేధం మోడీ , రేవంత్ కుట్రలో భాగమే అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సూర్యాపేట లో మీడియా మాట్లాడిన జగదీష్ రెడ్డి,మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా? అంటూ ప్రశ్నించారు. కార్మికులు అవమానకరంగా మాట్లాడిన సందర్భంలో స్పందించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ మాటలను వక్రీకరించారని అన్నారు.
కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోడీకి వణుకుడు మొదలైంది.ఆరు యాత్రలతోనే కాళ్ళ కింద భూమి కంపిస్తుందని పేర్కొన్నారు. చోటే..బడే భాయ్ ఇద్దరు కుట్ర చేసి ప్రచారం ఆపాలని చూస్తున్నారని మండి పడ్డారు.కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నం చేశారు. కేసీఆర్ ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుంది.మోడీ విద్వేషాల ప్రచారం ఈసీకి కనిపించడంలేదా అంటూ ఫైర్ అయ్యారు.ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తే రేవంత్ కి నోటీసులు, మా సోషల్ మీడియా ఇంఛార్జి క్రిషాంక్ అరెస్ట్, మా అధినేత కేసీఆర్ కి మాత్రం ప్రచార నిషేధమా అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్ ని అడ్డుకోకపోతే నష్టం జరుగుతుందనే కుట్రకు తెర లేపారని అన్నారు.వీధి రౌడీగా మాట్లాడిన రేవంత్ స్వేచ్ఛగా తిరిగితుంటే కేసీఆర్ ని మాత్రం ఇంట్లో పరిమితంగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ ఢిల్లీ ఎందుకు మూటల పై సమాచారం ఉంటే మోడీ అవినీతి పెట్టడంలేదనీ ప్రశ్నించారు.రేవంత్ పై మోడీ కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.రేవంత్ పై విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని అన్నారు.కేసీఆర్ లేవనెత్తుతున్న ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా పక్కదారి పట్టించడం కోసమే డ్రామాలు ఆడుతున్నారని,నిషేధాలు ఏవీ కేసీఆర్ ని ఆపలేవు అన్నారు.కేసీఆర్ ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదని ప్రజల్లో చర్చ మొదలైంది. నిషేధాలు పెట్టిన 16 సీట్లు మావే అన్నారు. కేసీఆర్ కు మద్దతుగా నేతలు కదిలివస్తున్నారని అన్నారు.కేసీఆర్ ని ప్రచారం చేయకుండా ఆపడం మా ఓట్ల శాతాన్ని పెంచుతుంది. రేపు వివరణకు రానున్న కు నోటు కేసుపై మాట్లాడిన జగదీష్ రెడ్డి , ఓటుకి నోటు కేసు ఇక్కడ ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానం ఉంది.అందుకే ఇతర రాష్ట్రానికి మార్చాలని కోరాం అన్నారు.