- మాజీమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు
- బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ దగ్గరలో గురువారం రాత్రి నిర్వహించిన బిఆర్‌ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన చేవెళ్ల బిఆర్‌ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అధ్యాపకులు.
ఈ సభలో రానున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మే 13న జరగబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓట్లు వేసి అభ్యర్థిని ఆశీర్వదించండి అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే.కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని బిజెపికి ఓటు వేయరాదని ఆమె అన్నారు. ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.
యాలాల, బషీరాబాద్ మండలాలకు సంబంధించిన బిఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అప్పట్లో కాంగ్రెస్ ఓటు వేసి మోసపోయారు. కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని గెలిపించి కెసిఆర్ కు గిఫ్టుగా అందించిన కాసాని జ్ఞానేశ్వర్ కార్యకర్తలకు అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో మోసం చేసిన పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారని సీఎం రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డి పై మండిపడ్డారు కార్యకర్తలు ఉన్నారు.