ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది. మే 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొదటి ఫేజ్‌లో జరగాలని అధికారులు తెలిపారు. రూ.200 రుసుంతో పాటకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి 27 వరకు ‘దోస్త్’ వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ 3వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 4వ తేదీ నుంచి 10వ తేదీ లోపు సెల్ఫ్ రిపోర్టుకు అవకాశం కల్పించారు.