బోడుప్పల్‌లో ఓ వ్యక్తి మృతి
బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వారి బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బోడుప్పల్ దేవేందర్ నగర్ ఫేజ్ -2 వద్ద ఎత్తయిన రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న వాహనం బ్రేక్ ఫెయిలై వెనక్కి వచ్చి, ఆ వెనుకే ప్రయాణిస్తున్న బైక్ ర్యాలీని ఢీకొంది. ఈ ప్రమాదంలో డీజే వాహనం కిందపడి ఒక కార్యకర్త చనిపోయారు. గాయాలు నిమ్స్ ఆసుపత్రికి మరో ఆసుపత్రికి. మృతి చెందిన కార్యకర్తను చిల్కానగర్ కు చెందిన ఎస్.శ్రావణ్ (25)గా పేర్కొన్నారు. అయితే, డీజే వాహనం వెనుకనే మరో వాహనంలో మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ బోడుప్పల్ అధ్యక్షుడు మందా సంజీవరెడ్డి ఉన్నారు. వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.