ముద్ర,తెలంగాణ:- నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు, పార్టీ అభ్యర్థిగా యువ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు బీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. 2023 నవంబరు 4వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాకేశ్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక’ యువతలో, విద్యావంతులలో మంచి పట్టున్న రాకేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, ఫాలోయింగ్‌తో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు.హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో గ్రామానికి చెందిన రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలానీ సహా అమెరికాలోని ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలో సిటీ బ్యాంక్ మేనేజర్‌గా, జేపీ మోర్గాన్, బుక్‌తో సహా పలు అంతర్జాతీయ ఫేస్‌బుక్ కంపెనీల్లో పనిచేశారు.