వెల్గటూర్, ముద్ర: జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండల “ఎంఈఓ” బత్తుల భూమయ్య వడదెబ్బ తగిలి శనివారం మృతి చెందాడు. పార్లమెంట్లు ఎన్నికల నేపద్యంలో బత్తుల భూమయ్యను ఫ్లయింగ్ స్కైడ్ అధికారిగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఎండపల్లి, రాజారాంపల్లి లో కరీంనగర్ -రాయపట్నం రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు.
ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక అశ్వస్థతకు గురి అయ్యాడు. శనివారం ఉదయం నీరసంగా ఉందని, గుండెలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలిపి కుర్చీలో కూర్చొని మృతి చెందినట్లు తెలిపారు. బత్తుల భూమయ్య ఎండపల్లి లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా య విధులను నిర్వహిస్తూ, అదనంగా వెల్గటూర్, ఎండపల్లి, బుగ్గరం, ధర్మపురి మండలాల్లో “ఎంఈఓ” గా భాద్యతలను నిర్వహిస్తూ మనసులను చూరగొన్నాడు. అతను మృతి చెందడం పట్ల నాలుగు మండలాల్లో నాయకులు, ఉపాధ్యాయులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.