ముద్ర, రంగారెడ్డి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి(కాంగ్రెస్)కి పెను ప్రమాదం తప్పింది. వెలజల-మిడ్జిల్ మండలం మధ్యలో గల రామాసిపల్లి మైసమ్మ దేవాలయం సమీపంలో ఆయన వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. కసిరెడ్డి ప్రయాణిస్తున్న వాహనంలోని నాలుగు బెలూన్లు ఓపెన్ కావడం స్వల్పగాయాలతో ఎమ్మెల్యే బయటపడ్డారు. రోడ్డుప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు నరేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరు గాయపడగా ఎమ్మెల్యేని తక్షణం కల్వకుర్తిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.. దీంతో ఎమ్మెల్యే అభిమానులు ఆందోళన చెంది పరుగులు తీశారు ఎమ్మెల్యే వద్ద చేరుకుని పరామర్శించారు