ముద్ర,హైదరాబాద్:- హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.ఈ మేరకు పోలీసులు సమాచారం అందించారు.బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిన్న రాత్రి ఈ ఘటన జరగ్గా, మృతులు ఒడిశా,ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కూలీలు.మృతులు ఒడిశాకు చెందిన తిరుపతి, శంకర్, రాజు, ఖుషి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్ యాదవ్, గీత, నాలుగేళ్ల చిన్నారి హిమాన్షుగా పేర్కొన్నారు.నిర్మాణంలో ఉన్న రిటన్నింగ్ వాల్ అక్కడ పని చేస్తున్నవారిపై పడడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.