- ఇంటింటి ప్రచారంలో కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపు రెడ్డి
బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భువనగిరి పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా భర్త చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సతీమణి చామల డింపు రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు కుంభం కీర్తి రెడ్డితో కలిసి ఆమె శుక్రవారం బీబీనగర్ పట్టణంతో పాటు గూడూరు పంచాయతీ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, అది కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి యువజన కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కోసం తన భర్త పనిచేశారని, దానికి గుర్తింపుగా ఈరోజు పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. ఈ రీతిలో పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డిలు ఇద్దరూ కలిసి బీబీనగర్ పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పరిగెత్తిస్తారని ఆమె చెప్పారు.
భువనగిరి నియోజకవర్గంలో నా తండ్రిని అత్యధిక మెజారిటీతో శాసనసభ్యునిగా గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలని, అదే రీతిలో ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించారు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా చేసింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు కుంభం కీర్తి రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య వైషమ్యాలను రగుల్చుతున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రజా పాలనను కాంగ్రెస్ ఈ దఫా అధికారంలోకి వచ్చేలా కృషి చేద్దామని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో ఎన్నికల ఛార్జి శిరీష్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు పంజాల రామాంజనేయ గౌడ్, బీబీనగర్ జడ్పీటీసీ గోలి ప్రణీత పింగళ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, గోలి పింగళ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, నాయకులు దండెం ప్రభాకర్, గోలి నరేందర్ రెడ్డి, పంజాల పెంటయ్య గౌడ్ జరిగింది.