కోరుట్ల, ముద్రణ: కోరుట్ల నియోజకవర్గం కల్లూరు గ్రామ పంచాయతీలో పోలింగ్ బూత్ నంబర్ 111లో గ్రామానికి చెందిన హోటల్ గంగమ్మ అనే 108 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకున్నారని గ్రామ మాజీ సర్పంచ్ వన తడుపుల అంజయ్య తెలియజేశారు. తనకు ఎనిమిది మంది సంతానం అని, చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం అని తన పెద్ద కూతురికి 80 పైబడిన వయస్సులో ఉన్నారు. స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న గంగమ్మను చూసి గ్రామస్తులు అధికారులు నివ్వెరపోయారు.