ముద్ర,తెలంగాణ:- ఉప్పల్ లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన మహిళ హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. భరత్ నగర్ కి చెందిన విజయ లక్ష్మి అనే మహిళ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కి చేరుకుని పోలింగ్ స్టేషన్ లోనే పడిపోయింది.దీంతో సదరు మహిళను పోలింగ్ సిబ్బంది, స్థానికులు హాస్పిటల్ కు నిర్వహించారు. గతంలో సదరు మహిళ హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. దీంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.