- ప్రభుత్వ నిబంధనలు పాటించని సుప్రజ హాస్పిటల్
- అర్హతకు మించి వైద్యం
- డిఎంహెచ్ఓ తనిఖీలు
- ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ సీజ్
- 15 రోజులు ఓపి సేవలు నిలిపివేత
సూర్యాపేట ముద్రణ ప్రతినిధి: ప్రైవేట్ వైద్యంలో అంతులేని దోపిడి’ శీర్షికన ప్రైవేట్ వైద్యులకు అర్హత లేకున్నా ల్యాబ్ లు ఏర్పాటు చేయడం, అర్హత లేని వ్యక్తులతో అనవసర పరీక్షలు నిర్వహిస్తున్న విద్యార్థులను పీల్చి పిప్పి సోమవారం ముద్రణ దినపత్రికలో వచ్చిన వార్తకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. సూర్యాపేట జిల్లా ఆసుపత్రిని సుప్రజ ఆసుపత్రిలో డీఎంహెచ్‌వో కోటాచలం మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల అనంతరం మాట్లాడుతూ డీఎంహెచ్వో మీడియాతో గత మార్చి నెల నుండి ఇప్పటివరకు అర్హత ఇప్పటికే 46 మంది సర్జరీలు ఉన్నారు. ఇందులో భాగంగా 15 రోజులు ఆసుపత్రి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ సీజ్ చేశామని, అనంతరం సరైన వివరణ ఇవ్వకపోతే ఆసుపత్రిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆసుపత్రులు, ల్యాబ్ లు, ఏర్పాటు చేస్తే, అనవసర స్కానింగ్ లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఎంహెచ్వోతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నారు.