- షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
- మురుగు కాలువల నిర్మాణానికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తా ..
ముద్ర/షాద్ నగర్:- పదేళ్ల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా చెప్పిందా అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. శుక్రవారం ఫరూక్నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామంలో మురుగు కాలువలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎక్కడ పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. విమర్శలు చేసే వ్యక్తులను తాను ఎన్నడూ పట్టించుకోనని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పరిపాలన అనుభవం లేక గత పాలకులు ప్రజాధనాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు.
లింగారెడ్డి గూడ గ్రామంలోని మాటలు మాట్లాడుతూ వాటిని ఇతరులపై వేయడం, పక్కదారి పట్టడం జరుగుతుందనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెంచర్ వద్ద పైపుల్లో చెత్తచెదారం నిండిపోయిందని దీనివల్ల నీరు నిలిచిపోయిందని తామేమైనా మోరీలు తీయొద్దన్నామా? శుభ్రం చేయొద్దన్నామా? అని ఎమ్మెల్యే శంకర్ ప్రశ్నించారు. గ్రామాభివృద్ధిలో ప్రజలందరూ కావాలని కోరుతున్నారు. పరిపాలనపై గత పాలకులకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని వివరించారు. ఎంతో పేరు ప్రతిష్ట కలిగిన లింగారెడ్డి గూడ గ్రామ రంగాలలో అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.భవిష్యత్తు తరాలకు ఎన్నెన్నో ఈ కాలువ పనికి వచ్చేలా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. లింగారెడ్డి గూడ గ్రామంలో ఎంతోమంది నాయకులు ఉన్నారని వారందరినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మంచి పనులు గ్రామానికీ చేపడతామని ఎమ్మెల్యే అన్నారు. లింగారెడ్డిగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల చర్యలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్న నాయకులు ఆ పనులు మానుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ అధ్యక్షుడు చల్ల శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, చెంది తిరుపతిరెడ్డి, కృష్ణారెడ్డి, మల్లేష్ యాదవ్, సురేష్ గౌడ్, లింగారెడ్డి గూడ అశోక్, ఫకీర్ భాష, రమేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, గణేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, ధనుంజయగౌడ్, రాజు రెడ్డి, శంకరయ్య యాదవ్, హరికృష్ణ, లక్ష్మీకాంత్ రెడ్డి, రవి చారి, చందు యాదవ్, మంగలి మల్లేష్, గంజి సంగ్రామ్, గంజి సురేష్, శివకుమార్, శేఖర్ గౌడ్, నారాయణ గౌడ్, మంగలి రామచంద్రయ్య, దాదేమియా, కుమార్, శీను, యాదయ్య, శేఖర్, సుధాకర్, మహదేవ్, దేవ , భీష్వ రమేష్, మల్లేష్, బక్కని కృష్ణయ్య ఉన్నారు.