- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే
ముద్ర ప్రతినిధి భువనగిరి : ఎం.ఎల్.సి. ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లు, టీములకు సూచించారు. సోమవారం కలెక్టరేటు మీటింగ్ హాలులో వరంగల్ -ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజక వర్గ ఉప ఎన్నిక సందర్భంగా సెక్టార్ ఆఫీసర్లకు, ఎఫ్.ఎస్.టి., స్పెషల్ వీడియో టీమ్స్, ఎం.సి.సి. టీములకు జరిగిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ నెల 27వ తేదీ ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుందని, భువనగిరి డివిజన్‌కు సంబంధించి 22, చౌటుప్పల్ మాట్లాడుతూ డివిజన్‌కు సంబంధించి 15, భువనగిరి, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారులు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
భువనగిరి డివిజన్‌కు సంబంధించి 7784 మంది స్త్రీలు, 12421 మంది పురుషులు, చౌటుప్పల్ డివిజన్‌కు సంబంధించి 5458 మంది స్త్రీలు, 8417 మంది పురుషులు కలిసి మొత్తం 34,080 మంది పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో మొత్తం 12 మంది సెక్టార్ ఆఫీసర్లు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, 17 స్పెషల్ వీడియో టీములు, 17 ఎం.సి.సి. టీములు పర్యవేక్షిస్తాయని తెలియచేస్తూ ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయవలసి ఉంది.
పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఉండేలా సెక్టార్ ఆఫీసర్లు చూడాలని, బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఓటర్లకు పోల్ స్లిప్స్ పంపిణీ అయ్యేలా చూడాలని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు పోలింగ్ మెరియల్ సకాలంలో వెళ్లేలా, తిరిగి పోలింగ్ కేంద్రాల నుండి పోల్ అయిన మెటీ రిసెప్షన్ సెంటర్‌కు చేరుకునేలా చూడాలని సూచించారు. ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారని, పోలింగ్ రోజున పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని, పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిథిలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా, ఉల్లాంఘనలు జరుగకుండా చూడాలని, ప్రతి రెండు గంటలకు పోలింగ్ శాతం వివరాలు తెలియజేయాలని, సాయంత్రం పోలింగ్ సమయం ముగిసే సమయానికి 4.00 గంటల లోపు పోలింగ్. కేంద్రం లోపలికి వచ్చిన వారందరూ ఓటు వినియోగించుకునేలా చూడాలని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాలపై, బహుమతులు, కానుకలు, నగదు, మద్యం పంపిణీపై నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో నిర్వహించాలని, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని అన్ని నిబంధనలను పాటించాలని కోరారు. ఎం.ఎల్.సి. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు బ్యాటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 52 మంది పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో జంబో బ్యాలెట్ బాక్సు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి అమరేందర్ గత.జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం జరిగింది.