- అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి
ముద్ర,తెలంగాణ:- ఎల్బీనగర్ కామినేని చౌరస్తాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కామినేని ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లపై గురువారం మధ్యాహ్నం అకస్మాత్తుగా దాడి చేశారు. అంబులెన్స్ డ్రైవర్ల కారణంగా పక్కనే ఉన్నటువంటి న్యూ మల్టీ కార్ కి సరిగ్గా గిరాకి రావడం లేదనే కారణంతో అంబులెన్స్ డ్రైవర్లపై దాడి చేశారు.దాదాపు గంట పాటు గొడవ కొనసాగుతోంది. ఆ తరువాత దాడి చేసిన న్యూ మల్టీ కార్ సిబ్బంది పై అంబులెన్స్ డ్రైవర్లు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ వ్యాపారానికి అడ్డు వస్తున్నారని న్యూ మల్టీ కార్ వ్యాపారి మనుషులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంబులెన్స్ డ్రైవర్లపై కర్రలతో దాడి
హైదరాబాద్ – తమ వ్యాపారానికి అడ్డువస్తున్నారని న్యూ మల్టీ కార్ ఓనర్ తన మనుషులతో అంబులెన్స్ డ్రైవర్లను కర్రలతో చితకబాదారు.
అంబులెన్స్ డ్రైవర్లు ట్రాఫిక్‌కి ఇబ్బంది కాకుండా ఎల్బీనగర్లో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అందుబాటులో ఉండాలి… pic.twitter.com/KOs4yOz3nx
— తెలుగు స్క్రైబ్ (@TeluguScribe) మే 23, 2024