ముద్ర,తెలంగాణ:- యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన గుంటిపల్లి సౌమ్య(25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. సౌమ్య చదువుతోపాటు పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తోంది. అయితే, ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో యాదగిరిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.