- శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకలను పట్టభద్రులు ఎన్నుకోవాలి
- తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి ముద్ర:- ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధాన ఆయుధమని ప్రశ్నించే గొంతుకలను ఎన్నుకోవడంలో ఓటు ప్రధాన పాత్ర పోషిస్తుందని తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు .సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనతోపాటు తన సతీమణి కమలా కిషోర్‌తో కలిసి తిరుమలగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడారు. శాసనమండలిలో ప్రభుత్వం వారిని ప్రజా వ్యతిరేక చట్టాలను రూపొందించి వాటిని ప్రశ్నించడానికి ప్రశ్నించే గొంతుకు అవసరమని అందుకే ప్రశ్నించే గెలిపించాలని కోరారు. ప్రజల పక్షాన అనునిత్యం పోరాడే వారి కోసం పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు .తాము వేసే ఓటు దుర్వినియోగం కాకుండా ఆలోచించి సరైన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఆ దిశగా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.