ముద్ర,తెలంగాణ:- నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్‌గౌడ్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్ నేతలే తనపై దాడి చేశారు అశోక్‌గౌడ్ ఆరోపిస్తున్నారు. స్థానిక డోకూరు గార్డెన్లో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లానని ఆయన చెప్పారు. ఎందుకు డబ్బులు పంచి అడిగినందుకు తన ఫోన్లు ధ్వంసం చేసి, దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. నార్కట్‌పల్లి పీఎస్ ముందు అశోక్ గౌడ్ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.