ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని సోమవారం తన ఛాంబర్‌లో ఉమ్మడిగా కలిసి జడ్జిలు మర్యాదపూర్వకంగా కలిశారు. కరీంనగర్ ఉమ్మడి ఏర్పాటు 9 మంది జడ్జిలు విధుల్లో భాగంగా శిక్షణ తీసుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్ కు వచ్చిన జడ్జిలు జిల్లా కలెక్టర్ పమేల సత్పతిని మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎం గోదాము పరిశీలన
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ తర్వాత ఈవీఎంలను భద్రపరిచేందుకు గోదాంలో గదులను నిర్వహిస్తున్నారు. అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు అనుకూలంగా ఉన్న గదులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈవీఎంల నోడల్ ఆఫీసర్ కిరణ్ ప్రకాష్, కలెక్టరేట్ ఏవో సుధాకర్, సూపరిండెంట్ శ్రీవాణి, నిర్వహించారు.