- బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలు.!
- కలుషిత ఆహారం తిని 8 మందికి అస్వస్థత.!
- శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం.!
- కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందన్న వైద్యులు.!
- వెయ్యి రూపాయల బిర్యానీ బిల్లు లక్ష రూపాయల ఆసుపత్రి బిల్లు.!
ముద్ర,తెలంగాణ:- పెళ్లి రోజు కదా అని కుటుంబ సభ్యులతో కలసి ఓ వ్యక్తి హోటల్ కు వెళ్ళాడు… బిర్యానీ ఆర్డర్ చేసి తిన్నారు…. కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి… అవస్థలు పడి ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది..
రంగారెడ్డి షాద్ నగర్ పరిధిలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన నరేందర్ తన పెళ్లి రోజు 22వ తేదీన బుధవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాద్ నగర్ పట్టణంలోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నరు ఇంటికి చేరుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరికి శంషాబాద్‌లో విరేచనాలు అయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు నరేందర్ కు రక్తపు వాంతులు విరేచనాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనతోపాటు ఆయన భార్య మంగమ్మ కుటుంబ సభ్యులు దీక్ష తన్విక అనిరూద్ అభిలాష్ జోష్ణ సాయి శ్రీకర్ మొత్తం ఎనిమిది మందికి అస్వస్థత కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు .