ముద్ర,హైదరాబాద్:-తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని పూలమాలలతో అంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీమంత్రులు మోత్కుపల్లి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కంభంపాటి రామ్మోహనరావు, కాట్రబెల్లి దయాకర్ రావు, కాట్రగడ్డ ప్రసూన, బక్కిన నరసింహులు ఉన్నారు.